Hyderabad,telangana, జూన్ 29 -- తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) సూసైడ్ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలోని తన నివాసంలో స్వేచ్ఛ. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపించారు. స్వేచ్ఛ కుమార్తె కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే వీరి ఆరోపణలపై పూర్ణచందర్ నాయక్ పేరుతో 5 పేజీలతో కూడిన లేఖ బయటికి వచ్చింది. ఇందులో పలు విషయాలను పేర్కొన్నారు.

స్వేచ్ఛతో తనకున్న అనుబంధం, వారి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల గురించి పూర్ణచందర్ వివరించారు. 2009 నుంచి తనకు స్నేహం ఉందన్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పనిచేస్తూ.. ఆరు ...