భారతదేశం, జనవరి 27 -- ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి నాడు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షాన్ని కూడా పొందవచ్చు. ఈసారి వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. జయ ఏకాదశి ఉపవాసం తేదీ, సమయం, పూజా విధానం సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏకాదశి తిథి జనవరి 28 సాయంత్రం 4:35కి ప్రారంభమై, జనవరి 29 మధ్యాహ్నం 1:55కి ముగుస్తుంది. ఈ లెక్కన జయ ఏకాదశి ఉపవాసం, పూజను జనవరి 29న జరుపుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టించి పూజ చేయాలి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశి విశిష్టతను వివరించాడు.

ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని, సక్సెస్‌ను అందుకోవచ్చని, పేదరికం నుంచి కూడా బయటపడవచ్చని తెలిపాడు. శత్రువుల బాధ...