భారతదేశం, జనవరి 23 -- ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణువును ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో వస్తాయి. ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశిగా జరుపుకుంటాము.

ఆ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సంతోషం, సంపద, అదృష్టం కూడా లభిస్తాయి. గంగా నదిలో స్నానం చేసి విష్ణువును ఆరాధించడం వలన శుభఫలితాలు పొందవచ్చు.

2026 పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జనవరి 28 సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమై, జనవరి 29 మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది. దీంతో జయ ఏకాదశి ఉపవాసం, వ్రతాన్ని జనవరి 29న జరుపుకోవాలి. ఉపవాసాన్ని జనవరి 30న విరమిం...