భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూ కాశ్మీర్‌ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీశ్ రంజన్‌ ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో హైదరాబాద్‌ వాసి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీశ్‌ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చేశారు. కోఠీలోని ఇంటెలిజెన్స్‌ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మనీశ్‌ రంజన్‌ ఎల్టీసీలో భాగంగా జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.

భార్యఇద్దరు పిల్లలతో కలిసి కశ్మీర్‌లో పర్యటిస్తున్న మనీశ్‌ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చి వేశారు. దాడికి ముందు మనీశ్‌ రంజన్‌ ప్రయాణిస్తున్న ట్రావెల్స్‌ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులో ప్రయాణికులను కిందకు దింపేశారు.

అతడి వద్ద ఉన్న పత్రాలను ...