Hyderabad, అక్టోబర్ 2 -- ఆహా వీడియో ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ రాబోతోంది. కామెడీకి తోడు మైథాలజీ, థ్రిల్లర్ జోడించి జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటించాడు. తాజాగా వచ్చిన ఫన్నీ టీజర్ ఆసక్తిగా సాగింది.

రాజ్ తరుణ్ లీడ్ రోల్లో వస్తున్న ఈ సినిమా పేరు చిరంజీవ. నిజానికి ఓ వెబ్ సిరీస్ గా వస్తుందనుకున్న దీనిని మూవీగా ఇప్పుడు ఆహా వీడియో పరిచయం చేసింది. అదిరే అభి (అభినయ కృష్ణ) డైరెక్ట్ చేశాడు. గురువారం (అక్టోబర్ 2) రిలీజైన టీజర్ ఫన్నీగా సాగిపోయింది. ఇందులో రాజ్ తరుణ్ ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

అతనికి అవతలి మనషులను చూడగానే ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోతారో చెప్పే శక్తి వస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసే అతని జీవితం దీనివల్ల ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నది అన్నదే ...