Hyderabad, జూలై 27 -- హిందూ ధర్మంలో పూజల సమయంలో, శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు ఉపయోగించే పవిత్రమాల జపమాల. 108 పూసలుండే జపమాలలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చదవాలని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి కరుణ ఉంటుందని అంటారు. దానికి అనుగుణంగా 108 పూసలను నిర్ధారించారని ప్రచారంలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఒక వ్యక్తి 24 గంటలలో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే 12 గంటల్లో 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మనిషి దేవుడి స్మరణలో జపమాల చేసేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం, కాబట్టి చివరి రెండు సున్నాలను తీసేసి 108గా నిర్ధారించారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మొత్తం 1...