భారతదేశం, జనవరి 15 -- జపాన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'పుష్ప 2: ది రూల్' జపాన్‌లో విడుదలకు రెడీ అయింది. ఈ సందర్భంగా ప్రమోషన్ల కోసం టోక్యో వెళ్లిన బన్నీకి అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గురువారం (జనవరి 15) జరిగిన సినిమా ప్రీమియర్ షోలో అల్లు అర్జున్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

టోక్యోలోని ఓ థియేటర్‌లో జరిగిన ప్రీమియర్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ వేదికపైకి రాగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఈ సందర్భంగా బన్నీ మైక్ అందుకొని జపనీస్ భాషలో 'పుష్ప' డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అతని డైలాగ్ డెలివరీకి, మ్యానరిజంకు జపాన్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బన్నీ పక్కనే ఉన్న నే...