భారతదేశం, జనవరి 21 -- తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్' రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ వర్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మధ్య కోర్టు కేసు కొనసాగుతోంది. దీనిపై తీర్పును తాజాగా మద్రాస్ హై కోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పు వెలువడ్డ తర్వాత జన నాయగన్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది.

విజయ్ దళపతి యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే పొలిటికల్ పార్టీ స్థాపించిన ఆయన తన చివరి సినిమా 'జన నాయగన్' అని ఇప్పటికే ప్రకటించేశారు. నిజానికి జన నాయగన్ సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 9న రిలీజ్ కావాల్సింది. టికెట్లు బుకింగ్స్ కూడా అప్పుడు స్టార్ట్ అయ్యాయి. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ...