భారతదేశం, జనవరి 6 -- ఈ వారం తమిళ సినిమాలో పెద్ద పండుగ. సంక్రాంతి సందర్భంగా అక్కడ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్', శివకార్తికేయన్ 'పరాశక్తి' మధ్య పోటీ నెలకొంది. అయితే తమిళనాడులోని ఒక థియేటర్ 'జన నాయగన్' కాకుండా 'పరాశక్తి'ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. దీంతో విజయ్ అభిమానులు ఆ థియేటర్ ఓనర్ పై బూతులతో దాడికి దిగారు. విజయ్ ఫ్యాన్స్ తమను వేధిస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని ఓనర్ ఆరోపించారు.

థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియాలో దళపతి విజయ్ అభిమానుల తీరుపై మండిపడింది. కోయంబత్తూరులోని వాసు సినిమాస్ ఈ సంక్రాంతికి 'జన నాయగన్' కంటే 'పరాశక్తి'ని ప్రదర్శించాలని అనేక కారణాల వల్ల నిర్ణయించుకున్నామని ఎక్స్ లో స్పష్టం చేసింది. 15 సంవత్సరాలుగా తమ థియేటర్లలో కొన్ని తప్ప విజయ్ చిత్రాలన్నింటినీ ప్రదర్శించామని కూడా వారు గుర్తు చేశారు. 'పరాశక్తి'న...