Hyderabad, జూన్ 28 -- చాలా మంది జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కృష్ణుడి జన్మదినంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. హిందూమతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం పవిత్ర శ్రావణ మాసంలో ఎనిమిదో రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని అన్ని దేవాలయాలు, ఇళ్ళలో ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని అర్ధరాత్రి జరుపుకుంటారు. రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుని జనన సమయంలో పాలాభిషేకం జరుగుతుంది.

ఈసారి జన్మాష్టమి ఆగస్టు 15న వచ్చిందా ఆగస్టు 16న వచ్చిందా అనే విషయానికి వస్తే.. పురాణాలు, మత గ్రంథాలు ప్రకారం, శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఈ పవిత్రమైన రోజున, దేవుడికి ప్రత్యేక ...