భారతదేశం, జనవరి 28 -- శని మనం చేసే పనులను బట్టి ఫలితాన్ని ఇస్తాడు. శని గ్రహం కష్టాలను, నష్టాలను తీసుకొస్తాడు. త్రయోదశితో వచ్చే శనివారం చాలా విశేషమైనది. ఆ రోజు శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. శని జాతకంలో వక్రదృష్టితో ఉన్నప్పుడు, శనివారం త్రయోదశి నాడు శనిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనిని శాంతింప చేయవచ్చు.

జనవరి 31న శనివారం త్రయోదశి రావడం చాలా విశేషం. ఆ రోజు కొన్ని నియమాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శని త్రయోదశి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? పూర్తిగా వివరాలు తెలుసుకుందాం.

త్రయోదశి తిధి జనవరి 30 ఉదయం 11:09 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 31 ఉదయం 8:06తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి కనుక జనవరి 31న శని త్రయోదశి పూజలు, పరిహారాలు పాటించడం వంటివి చేయాలి.

శని పాప పుణ్యాలను పరిగణలోకి తీసుకుంటాడు. నవగ్రహాల్లో శని ఏ...