భారతదేశం, డిసెంబర్ 23 -- వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే చాలాసార్లు సమావేశాలు నిర్వహించి కీలక విషయాలు ప్రకటించింది. తాజాగా మంత్రులు కూడా టీటీడీతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. మరోవైపు తిరుమల దర్శనంపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.

టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వారికి అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టతనిచ్చారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టోకెన్లు లేకుంటే తిరుమలకు రానివ్వరని దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మకూడదని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పారు. టిక్కెట్లు లేని భక్తులు జనవరి 2వ తేదీ నుండి సర్వ దర్శన...