భారతదేశం, జనవరి 8 -- మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమకొండలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన శ్రీనివాస్ రెడ్డి.. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల స్థితిపై సమీక్షించారు. మేడారంలో దాదాపు 200 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా రాతి కట్టడాల వంటి శాశ్వత పనులను చేపట్టామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మేడారంలో రహదారుల విస్తరణ, య...