Hyderabad, మార్చి 17 -- ఒక వైద్యుడు జనరిక్ మందులను వాడమని ప్రజలకు సూచించడం ప్రారంభిస్తే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య ఖర్చును 70 శాతం వరకు తగ్గించవచ్చు. ఇది మేము చెబుతున్నది కాదు... ఎన్నో సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. ఎందుకంటే మన దేశంలో జనరిక్ మందుల వినియోగ శాతం కేవలం 10 నుంచి 12 శాతమే ఉంది. వైద్యులే వీటిని సూచించేందుకు ముందుకు రావడం లేదు.

బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. బ్రాండెడ్ మందులు ధర 100 రూపాయలు ఉంటే జనరిక్ మందులు ధర కేవలం పది రూపాయలు ఉంటుంది. జనరిక్ మందులు పేద ప్రజలకు వరం లాంటివి.

ఒక టాబ్లెట్‌ను లేదా సిరప్‌ను కనిపెట్టడానికి ఎన్నో ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తాయి. కొన్ని ఏళ్లపాటు ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఆ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే వాటిని ఒక ధర నిర్ణయించి మ...