భారతదేశం, జూలై 15 -- జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో అవకతవకలను అరికట్టడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్‌ఎస్)ను తీసుకోనుంది. భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం(ఓఆర్‌జీఐ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు జనన, మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయి.

ఓఆర్‌జీఐ వెబ్‌పోర్టల్‌ను ఉపయోగించుకునేందుకు జీహెచ్‌ఎంసీకి అనుమతి ఇచ్చింది. కొత్త విధానం త్వరలోనే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జనన ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి తల్లిదండ్రుల ఆధార్ వివరాలను సమర్పించాలని జీహెచ్‌...