భారతదేశం, జనవరి 24 -- దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చుట్టూ ఇటీవల ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంపై 'కమ్యూనల్' వ్యాఖ్యలు చేసిన ఈ లెజండ్.. ఆ తర్వాత వందేమాతరం పాడనాన్నారనే వార్తతో మరింత కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. కానీ ఒక స్టేజ్ మీద ప్రదర్శనతో ఈ విమర్శలకు రెహమాన్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

యూఏఈలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ తెగ వైరల్ గా మారుతోంది. జనవరి 23న ఈ కాన్సర్ట్ జరిగింది. ఇందులో ఆయన తన పాపులర్ హిట్ సాంగ్స్ తో పాటు జనగణమన, వందేమాతరం పాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అభిమానులు ఆయన కచేరీ నుండి వీడియోలను పంచుకున్నారు. కొందరు అక్కడ రెహమాన్ 'జనగణమన', 'వందేమాతరం' పాడినట్లు కూడా పేర్కొన్నారు.

ప్...