Telangana, ఆగస్టు 15 -- మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచారం ఫ్లైఓవర్ వద్ద ట్రావెల్స్ బస్సు, లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో మాచారం ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించామని జడ్చర్ల పోలీస్ స్టేషన్ ఎస్సై తెలిపారు.

చనిపోయిన నలుగురి మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. అనంతరం వారి కుటుంబాలకు అప్పగించామని అధ...