భారతదేశం, జనవరి 24 -- ఇటీవలే కాలంలో తెలంగాణలో వీధి కుక్కల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ చాలా గ్రామాల్లో వీధి కక్కుల సమస్యపై పలువురు అభ్యర్థులు హామీలిచ్చారు. ఈ క్రమంలోనే గెలుపొందిన చాలా మంది సర్పంచ్ లు. వీధి కక్కుల సమస్యలను తగ్గించే క్రమంలో దారుణానికి ఒడిగడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి . విష ప్రయోగాలతో చంపేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వందల సంఖ్యలో వీధి కుక్కులు చనిపోయిన ఘటనలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

తాజాగా జగిత్యాల జిల్లాలో 300 కుక్కలు మృతి చెందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వీధి కుక్కల సంఖ్య 900కు చేరింది. జనవరి 22న పెగడపల్లి గ్రామంలో 300 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లు ఫిర్యాదు అందటంతో ఈ ఘటన బయటికి వచ్చింది. ఈ దారుణమైన చర్యకు గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి కారణమని ...