భారతదేశం, ఏప్రిల్ 20 -- జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఉపాధి కోసం గ్రామానికి చెందిన గడ్డం నర్సారెడ్డి (50) సౌదీ అరేబియాలోని ఇరాక్‌ సరిహద్దు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆరార్‌ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 6 నెలలుగా మృత్యువుతో పోరాడి ఈ నెల 6న అక్కడే తుదిశ్వాస వదిలాడు.

ఈ విషయం వృద్ధులైన తల్లిదండ్రులకు తెలిసింది. హృదయ విదారకంగా రోదించారు. తల్లి హన్మక్క (72) కుమారుడి మరణవార్త తెలిసి బెంగతో మంచం పట్టింది. కుమారుడి చివరి చూపు చూడకుండానే శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. కేవలం రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తొంబర్రావుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్ర...