భారతదేశం, జనవరి 11 -- అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. అమరావతి రైతుల తరపున వైఎస్ జగన్ సరైన ప్రశ్నలు లేవనెత్తారని చెప్పారు. మొదటి దశలో దాదాపు 50 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకున్నారని. వాటి అభివృద్ధే ఇంకా పూర్తి సరైన రోడ్లు, కనెక్టివిటీ లేకపోవడం, ప్లాట్ డెవలప్మెంట్ లేకపోవడంతో రైతులు ఇబ్బందుల్లో పడేసినట్లు అయిందని చెప్పారు.

చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించడం నిజం కాదా అని జగన్ ప్రశ్నించారని సజ్జల చెప్పారు. అభివృద్ధి చేయకపోతే ఇలాంటి ప్లాట్లు ఎవరు కొనుగోలు చేస్తారని అడిగారని వివరించారు. కానీ జగన్ వ్యాఖ్యలను పక్కదోవ పట్టించేలా కూటమి నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో అమరావతి కోసం కేవలం రూ.5,000 కోట్లు మాత్రమే ఖర్...