భారతదేశం, జూన్ 25 -- సాగునీటి ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించకుండా కాంట్రాక్టర్ల కోసం నిర్మించాలనుకోవడం సరికాదని ఆలోచనపరుల వేదిక సూచించింది. కాంట్రాక్టర్ల ఒత్తిడి, లాభాల కోసం ప్రాజెక్టుల నిర్మాణం సరికాదని, ఈఏపీ పేరుతో కాంట్రాక్టర్లే డిజైన్ చేసి, రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టి ప్రజలపై అప్పుల భారం మోపడాన్ని తప్పు పట్టారు. జగన్‌-కేసీఆర్‌-మేఘా కృష్ణా రెడ్డి మదిలో పుట్టిన బనకచర్లపై చంద్రబాబు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వక్తలు ప్రశ్నించారు.

ఏపీలో పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా నది మీదుగా బనకచర్లకు తరలించాలనే ప్రతిపాదన తక్షణం ఉపసంహరించుకోవాలని సాగునీటి నిపుణులు డిమాండ్ చేశారు. రాయలసీమకు నీరుపేరుతో ప్రజల్నిమభ్య పెడుతున్నారని, దాని వల్ల నికర జలాల్లో వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ...