భారతదేశం, అక్టోబర్ 7 -- మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నుండి మాకవరపాలెంకు హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చినట్లు అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ తుహిన్‌ సిన్హా తెలిపారు.

మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడారు. 'విశాఖపట్నం విమానాశ్రయం నుండి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి జగన్ పర్యటన కోసం వైసీపీ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ రహదారిపై ముఖ్యమైన కూడళ్లలో ర్యాలీ, నిరసన నిర్వహించనున్నట్లు సమాచారం. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది.' అని ఎస్పీ అన్నారు.

ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశార...