Hyderabad, జూన్ 15 -- పూరిలో నిర్వహించే రథయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు. ఒరిస్సా లో ఉన్న పూరీలో జగన్నాథుని ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజు రథయాత్రను ఘనంగా జరుపుతారు. జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర కలిసి రథాలపై పర్యటిస్తారు.

ఈ అద్భుతమైన రథయాత్రను వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రథయాత్రను చూసినట్లయితే 1000 యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఇదంతా పక్కన పెడితే, అసలు రథయాత్రను ఎందుకు జరుపుతారు? జగన్నాథుని రథయాత్ర వెనుక ఉన్న పురాణ కథలకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం చూసినట్లయితే, సుభద్ర దేవి నగరాన్ని చూడాలని అనుకుంటుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రతో కలిసి...