Hyderabad, జూలై 12 -- 'హిందీ భాషా వివాదం'పై పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై నటుడు ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు హిందీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు.

ఈ కామెంట్స్ ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య మరోసారి అభిప్రాయ బేధాలు తలెత్తేలా చేసింది. హిందీ భాష ప్రాముఖ్యత గురించి పవన్ కల్యాణ్ గొప్పగా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఆ వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసిన ప్రకాష్ రాజ్ ఘాటు రిప్లై ఇచ్చారు.

"ఈ రేంజ్‌కు అమ్ముకోవడమా.. ఛీ.. ఛీ.." జస్ట్ ఆస్కింగ్ అనే హ్యా‌ష్‌ట్యాగ్‌తో పవన్ కల్యాణ్ హిందీ భాషపై చేసిన కామెంట్స్ వీడియోను షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది....