భారతదేశం, మే 21 -- ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జాము నుంచి భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల మాడ్ డివిజన్ కు చెందిన సీనియర్ కేడర్లు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో నాలుగు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్స్ పోలీసు బృందాలు అభుజ్ మఢ్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో కకావికలైన మావోయిస్టులు బుధవారం నాటి ఎన్ కౌంటర్ తో మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నారాయణపూర్ ఎన్ కౌంటర్ లో సుమారు 25 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

చత్తీస్‌గడ్‌ నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మావోల కీలక నేత నంబాల కేశ...