భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు (సీసీఎం) మోడెం బాలకృష్ణ కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మెయిన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు జరిగినట్లు రాయ్ పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఇతర బలగాలు ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. "సీనియర్ కార్యకర్తలతో సహా పది మంది నక్సలైట్లు మృతి చెందారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది" అని తెలిపారు.

రాజధాని రాయ్ పూర్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో అగ్రశ్రేణి నక్సలైట్ల కదలికల సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు ...