భారతదేశం, డిసెంబర్ 4 -- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. జిల్లాలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు.

బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు వెంబడి ఉన్న అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. దంతెవాడ, బీజాపూర్ కు చెందిన డీఆర్జీ సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్- సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్) ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పారు.

ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో...