భారతదేశం, ఏప్రిల్ 25 -- ఇంద్ర‌రామ్, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించిన చౌర్య పాఠం. ఈగ‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మేని క‌థ‌, అందించ‌డం, ధ‌మాకా డైరెక్ట‌ర్‌ త్రినాథ‌రావు న‌క్కిన నిర్మించ‌డంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు నిఖిల్ గొల్ల‌మూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 25న థియేట‌ర్ల‌లో రిలీజైన చౌర్య పాఠం మూవీ ఎలా ఉందంటే?

వేదాంత్‌రామ్(ఇంద్ర‌రామ్‌) ఓ సినిమా పిచ్చోడు. ఎప్ప‌టికైనా సినిమా తీయాల‌న్న‌ది అత‌డి క‌ల. కానీ డ‌బ్బులు ఉండ‌వు. ధ‌న‌పాలి గ్రామీణ బ్యాంకును దోచుకొని ఆ డ‌బ్బుల‌తో సినిమా తీయాల‌ని ప్లాన్ వేస్తాడు.

ఆ బ్యాంకును దోచుకోవ‌డానికి బ‌బ్లూ (మ‌స్త్ అలీ), జాక్‌డాన్‌తో(అంజి) పాటు మ‌రో స్నేహితుడితో క‌లిసి ఓ టీమ్ ఏర్పాటుచేస్తాడు. బ్యాంకు దోచుకోవ‌డానికంటే ముందు ధ‌న‌పాలి ఊరి గురించి తెలుసుక...