భారతదేశం, ఫిబ్రవరి 2 -- సాధారణంగా పెళ్లి అనగా ఆటాపాటా ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు స్నేహితులు మాత్రం అస్సలు ఊరుకోరు. పెళ్లి కొడుకు వచ్చి డ్యాన్స్ చేసేదాగా వెంటపడుతారు. కానీ ఓ పెళ్లిలో మాత్రం పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం వివాహం రద్దుకు కారణమైంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మాధురీ దీక్షిత్ హిట్ పాటకు పెళ్లి కొడుకు అనుచితంగా డ్యాన్స్ చేశాడని పెళ్లిని రద్దు చేసినట్టుగా అందులో ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దిల్లీలో ఇటీవల ఓ పెళ్లి జరుగుతోంది. అయితే వేదిక వద్దకు ఊరేగింపుగా వస్తున్నాడు వరుడు. ఆ సమయంలో స్నేహితులు డ్యాన్స్ చేద్దామని అతడిని పిలిచారు. ఈ సమయంలో చోలీ కే పీఛే క్యాహై అనే పాటక...