భారతదేశం, జూలై 24 -- అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. తూర్పు అముర్ ప్రాంతంలో రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానంతో సంబంధాలు తెగిపోయాయని రష్యన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతం రష్యా, చైనా సరిహద్దులో ఉంది. అదృశ్యమైన విమానం అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందినది.

మీడియా నివేదికల ప్రకారం, అంగారా ఎయిర్‌లైన్స్ విమానం అముర్ ప్రాంతంలోని టిండాకు వెళుతోంది. విమానంలో ఐదుగురు పిల్లలు సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. స్థానిక గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ టెలిగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో విమానం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

రష్యన్ ఫార్ ఈస్ట్‌లో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న AN - 24 ప్యాసింజర్ విమానం ఇది. రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది....