భారతదేశం, జూలై 24 -- అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. తూర్పు అముర్ ప్రాంతంలో రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానంతో మెుదట సంబంధాలు తెగిపోయాయని రష్యన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతం రష్యా, చైనా సరిహద్దులో ఉంది. అదృశ్యమైన విమానం అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందినది. కాసేపటికి ఇది కుప్పకూలినట్టుగా అధికారులు గుర్తించారు.

మీడియా నివేదికల ప్రకారం, అంగారా ఎయిర్‌లైన్స్ విమానం అముర్ ప్రాంతంలోని టిండాకు వెళుతోంది. విమానంలో ఐదుగురు పిల్లలు సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మెుదట విమానం అదృశ్యమైందని వార్తలు వచ్చాయి. తర్వాత దీనికోసం గాలించగా గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలినట్టుగా గుర్తించారు.

రష్యన్ ఫార్ ఈస్ట్‌లో దాదాపు 49 మందితో ప్రయాణిస్తున్న AN - 24 ప్యాసింజర్ విమానం ఇద...