భారతదేశం, అక్టోబర్ 28 -- తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడం కోసమేనని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కొత్త నిబంధన ఆన్‌లైన్ స్వేచ్ఛకు పెను దెబ్బ అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ కంటెంట్ తయారీ పద్ధతిని పూర్తిగా మార్చగలిగే ఈ నిర్ణయంలో భాగంగా, వైద్యం, న్యాయం, విద్య, ఆర్థిక అంశాల వంటి 'సున్నితమైన' విషయాల గురించి ఆన్‌లైన్‌లో చర్చించాలంటే ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు అధికారిక అర్హతలు ఉండాలని చైనా కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

అక్టోబర్ 25న అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం, ఏదైనా నియంత్రిత అంశం గురించి పోస్ట్ చేయాలనుకుంటే.. క్రియేటర్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. దీనికి డిగ్రీ, వృత్తిపరమైన లైసెన్స్ లేదా ధృవీకరణ పత్రం వంటి రుజువును చూపించడం తప్పనిసరి. ఈ విషయాన్ని మొరాకో న్యూస్ నివేదించింది.

చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CA...