భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆదుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా వెల్లడించారు.

చేవెళ్ల ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు పొన్నం. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని వెల్లడించారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు కొన్ని మృతదేహాలను మాత్రమే పోలీసులు గుర్తించారని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

అంతకుముందు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫ...