భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్‌ ఢీకొట్టింది. రహదారిపై గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందగా చాలా మందికి గాయాలు అయ్యాయి. వేర్వేరు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ బస్సు- టిప్పర్‌ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్‌పై కేసు నమోదు అయింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన కమలే ఆకాశ్‌గా గుర్తించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లచ్చానాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర సరఫరా చేస్తున్నాడు.

చేవెళ్ల ప్రభుత...