భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

పటాన్‌చెరు లక్డారం క్రషర్‌ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్తోంది లారీ. రహదారిపై గుంతను తప్పించబోయి మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ కొట్టింది. ఎదురుగా వచ్చి పూర్తిగా ఆర్టీసీ బస్సుపైకి ఒరిగింది. బస్సులోని ప్రయాణికులపై లారీలో ఉన్న కంకర పడింది. దీంతో కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయారు. కంకరతో బస్సు నిండడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. మూడు జేసీబీల సహాయంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

బస్సుపై కంకరలో...