భారతదేశం, డిసెంబర్ 17 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఎన్నో లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని తాజాగా మరోసారి నిరూపితమైంది. ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి తాను కూడా బాధితురాలినే అని నటి శ్రీలీల చెప్పింది. ఈ ఏఐ జనరేట్ చేసిన నాన్సెన్స్ ను సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

నటి శ్రీలీల బుధవారం (డిసెంబర్ 17) ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సెలబ్రిటీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెబుతూ ఈ పోస్ట్ సాగింది. ఇందులో ఆమె తన అభిమానులను ఏఐ జనరేట్ చేసిన చెత్తను సపోర్ట్ చేయొద్దని కోరడం విశేషం.

"నేను రెండు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను.. దయచేసి AI సృష్టించిన ఈ చెత్తను సపోర్ట్ చేయకండి. టెక్నాలజీని వాడుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది....