భారతదేశం, అక్టోబర్ 26 -- పాప్ స్టార్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తమ డేటింగ్ ను కన్ఫామ్ చేశారు. ఈ వీకెండ్ లో పారిస్ వీధుల్లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. ఒక జంటగా వారు బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. టీఎంజెడ్ నివేదిక ప్రకారం కేటీ పెర్రీ 41వ పుట్టినరోజు వేడుకల కోసం పెర్రీ, ట్రూడో శనివారం రాత్రి ఫ్రెంచ్ రాజధానిలో బయటకు వచ్చారు. ఈ జంట ప్రసిద్ధ క్రేజీ హార్స్ పారిస్‌లో జరిగిన క్యాబరే షోకు హాజరయ్యారు. అక్కడ వారిని ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు వేచి ఉన్నారు.

అభిమానులు కేరింతలు కొడుతుండగా కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో వేదిక నుండి చేతిలో చేయి వేసుకుని బయటకు వస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ జంట తమ కారు వద్దకు నడుస్తుండగా ఒక అభిమాని కేటీకి గులాబీ పువ్వు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ...