భారతదేశం, జనవరి 12 -- సనన్ కుటుంబంలో పెళ్లి సందడి అంబరాన్నంటింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, నటి నుపుర్ సనన్.. తన చిరకాల మిత్రుడు, పాపులర్ సింగర్ స్టెబిన్ బెన్‌తో ఏడడుగులు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత వేడుకగా, కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నుపుర్ సనన్, స్టెబిన్ వివాహం జరిగింది.

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుక అనంతరం ఏర్పాటు చేసిన ఆఫ్టర్ పార్టీలో సంగీత విద్వాంసులు బి ప్రాక్, సాగర్ భాటియా (సాగర్ వాలీ కవ్వాలీ) తమ ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక వీడియోలో, సాగర్ భాటియా 'ఐసే నా జావో పియా' అనే పాట పాడుతుండగా.. ప్రభాస్ ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ ఎంతో ఉత్సాహంగా ఆయనతో కలిసి పాడుతూ, స్టెప్పులేస్తూ కనిపించా...