భారతదేశం, మే 17 -- చెరువుల్లో మ‌ట్టి, నిర్మాణ వ్య‌ర్థాలు పోస్తే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని.. హైడ్రా హెచ్చ‌రించింది. చెరువ‌ల‌పై నిరంత‌రం నిఘా ఉంటుంద‌ని.. మ‌ట్టిపోసిన వారిని సాక్ష్యాధారాల‌తో ప‌ట్టుకుని వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు, బిల్డ‌ర్లు, ట్రాన్స్‌పోర్ట‌ర్ల‌తో పాటు ఆయా సంఘాల ప్ర‌తినిధుల‌తో శ‌నివారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో హైడ్రా ప‌లు సూచ‌న‌లు చేసింది.

ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌కు చెరువుల ప‌రిర‌క్ష‌ణ ఎంతో అవ‌స‌ర‌మ‌ని.. ఆ దిశ‌గా హైడ్రా ప‌నిచేస్తోంద‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ వ్యాఖ్యానించారు. బిల్డ‌ర్లు - ట్రాన్స్‌పోర్ట‌ర్లు క‌ల‌సి.. మ‌ట్టిని ఎక్క‌డ పోయాలో ముందుగానే ఒక అవ‌గాహ‌న‌కు రావాల‌ని సూచించారు. అలా కాదు.. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రించి.. మ‌ట్టిని త‌ర‌లించే ప‌ని కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌గించాం.. ...