భారతదేశం, జూన్ 20 -- స్టార్ నటి సమంత బాడీపై టాటూస్ ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యను గతంలో పెళ్లి చేసుకున్న ఆమెతో కొన్ని మెమొరీస్ ఎప్పటికీ నిలిచిపోవాలని టాటూస్ వేయించుకుంది. కానీ చైతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ పచ్చబొట్లను చెరిపేస్తోంది. ఈ క్రమంలో మెడపై ఉన్న వైఎంసీ టాటూను కూడా తొలగించుకుంది అనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ ఫొటల్లో ఆ టాటూ కనిపించింది.

సమంత రూత్ ప్రభు రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. నథింగ్ టు హైడ్ ప్రకటనతో జూన్ 6న వీడియో పెట్టింది. ఈ వీడియోలో సమంత కెమెరా దగ్గరికి వెళ్లి మార్కర్ తో 'నథింగ్ టు హైడ్' అని రాస్తోంది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి వెళ్లిపోతుంది. వెనక్కి వెళ్లిపోతున్న సమయంలోనే సమంత శరీరంపై టాటూ మిస్ అయిన సంగతి ఫ్యాన్స్ కంటపడింది.

సమంత పోస్టు చేసిన వీడియోలో ఆమె శరీరం వెనుక భాగంలో మెడ కింద 'వైఎ...