భారతదేశం, ఆగస్టు 14 -- స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ జెండా ఎగురవేయడం, దేశభక్తి పాటలు పాడటం మాత్రమే కాదు. మన త్రివర్ణ పతాకంలోని ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. వీటి గురించి కూడా తెలుసుకోవడం అవసరం. కేసరి రంగు మన దేశం యొక్క బలం, ధైర్యం, త్యాగం, నిస్వార్థాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతి, సత్యం, స్వచ్ఛతకు ప్రతీక. ఇక ఆకుపచ్చ రంగు సస్యశ్యామలమైన మన నేల, ఎదుగుదల, శ్రేయస్సు, విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఈ మూడు రంగులను మన హృదయంలో నింపుకొని వేడుకలు జరుపుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతి.

అయితే, ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. మన జాతీయ జెండాలోని మూడు రంగుల ప్రేరణతో ఆయన మూడు విభిన్నమైన వంటకాల రెసిపీలను తన వెబ్‌సైట్‌లో పంచుకున్నారు. దేశభక్తిని రుచ...