Hyderabad, ఆగస్టు 2 -- యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన బ్యూటిపుల్ అనసూయ భరద్వాజ్ అనంతరం సినిమాల్లో నటిగా కీలక పాత్రలతో మెప్పించింది. క్షణం, రంగస్థలం, రజాకార్, రంగ మార్తాండ, పుష్ప వంటి ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా, మెంటార్‌గా వ్యవహరిస్తూ అలరిస్తోంది. అంతేకాకుండా పలు షోలకు, ఈవెంట్లకు, ఓపెనింగ్ కార్యక్రమాలకు అతిథిగా సైతం వెళ్తుంటుంది అనసూయ భరద్వాజ్. అయితే, ఏదైనా సరే సూటిగా మాట్లాడే అనసూయ ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంది.

తాజాగా కొంతమంది ఆకతాయులకు స్టేజీ పైనుంచే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ భరద్వాజ్. తనపై అసభ్య కామెంట్స్ చేసిన యువకులకు దిమ్మ తిరిగపోయేలా కౌంటర్ ఇచ్చింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ...