Andhrapradesh, జూలై 12 -- శ్రీకాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు తమిళనాడులోని చెన్నైలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో అతని మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సెవెన్ వెల్స్ పోలీసులు. విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

రాయుడుని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా గుర్తించగా.వీరిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్‌ వినూత, ఆమె భర్త చంద్రబాబు కూడా ఉన్నట్లు తేలింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం.

శ్రీకాళహస్తి జ‌నసేన ఇంచార్జ్ గా ఉన్న వినూత వద్ద రాయుడు డ్రైవర్ గా పని చేశాడు. అంతేకాకుండా నమ్మినబంటుగా ఉంటూ ఇతర పనులు కూడా చేసేవాడు. కొన్ని కారణాల రీత్యా రాయుడు...