భారతదేశం, డిసెంబర్ 6 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చెన్నై, ముంబై, కోల్‌కతాకు స్పెషల్ రైళ్లు ఉన్నాయి. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

రైలు నంబర్ 07146 సికింద్రాబాద్-చెన్నై ఎగ్మోర్ రైలు డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం 6.40కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చెన్నై చేరుకుంటుంది. 07147 చెన్నై ఎగ్మోర్-సికింద్రాబాద్ రైలు డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి.. డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రూట్‌లో ట్రైన్ కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురులో ఆగుతుంది.

రైలు నంబర్ 07150 హైదరాబాద్ - ముంబై LTT ప్రత్యేక రైలు డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 8.25 గంటలకు హైదరాబాద్ నుండి...