భారతదేశం, ఫిబ్రవరి 13 -- అతను ఒక ఐటీ ఉద్యోగి. ప్రస్తుతం ఒక చెత్త వేసే ప్రదేశాన్ని కొనేందుకు చూస్తున్నాడు. చెత్త నుంచి ఏం సంపాదిస్తాడు అని మీరు అనుకోవచ్చు. కానీ చెత్తకుప్పను కొనడం వెనక అతడి ఉద్దేశం వేరు. అందులో రూ.6500 కోట్ల విలువైన బిట్‌కాయిన్ల సమాచారం ఉంది.

బ్రిటన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి జేమ్స్ హోవెల్స్. ఇతడు కంప్యూటర్ ఎక్స్‌పర్ట్. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్ వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో చెత్త కుప్పను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అనుకోకుండా చెత్తబుట్టలో పోగొట్టుకున్న హార్డ్‌డ్రైవ్ ఇప్పుడు అతడికి అవసరం. ఎందుకంటే అందులో సుమారు రూ.6,500 కోట్లు విలువైన బిట్‌కాయిన్‌ల డేటా ఉంది. సుమారు 12 సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ సంఘటన 2013లో జరిగింది. బిట్‌కాయిన్ డేటా ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ఒక నల్లటి సంచిలో పెట్టి తన ఇంటి హా...