భారతదేశం, ఫిబ్రవరి 17 -- పవన్ కల్యాణ్ సినిమా బద్రి, మహేష్ బాబు మూవీ నానిలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్ గుర్తుందా? ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు లీగల్ కేసులో ఇరుక్కుంది. చెక్ బౌన్స్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఓ వైపు బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో లొంగిపోయిన నేపథ్యంలో అమీషా పటేల్ కేసు హాట్ టాపిక్ గా మారింది.

2017 ఈవెంట్ కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో మొరాదాబాద్ కోర్టు తాజాగా అమీషా పటేల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017 నవంబర్ 16న జరిగిన ఒక వెడ్డింగ్ ఈవెంట్లో డ్యాన్స్ పర్పార్మెన్స్ కోసం అమీషాతో డీల్ సెట్ చేసుకున్నారు. అందుకు ఆమె రూ.14.50 లక్షల అడ్వాన్స్ తీసుకుంది. కానీ ఈవెంట్ కు అటెండ్ కాలేదు. అడ్వాన్స్ తిరిగివ్వాలని అడిగితే అమీషా ఇచ్చిన చెక్ బౌన్స్ అయినట్లు తెలిసింది.

మ...