భారతదేశం, సెప్టెంబర్ 11 -- ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట.. న్యూయార్క్‌లో తమ సరికొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ప్రముఖ డిజైనర్ రాల్ఫ్ లారెన్ తన లేటెస్ట్ కలెక్షన్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ నటి జెస్సికా చాస్టైన్, ఓప్రా విన్‌ఫ్రేతో పాటు అనేకమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో బ్రౌన్ కలర్ ఔట్‌ఫిట్స్‌లో మెరిసిపోయిన ప్రియాంక, నిక్ జోనాస్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రియాంక చోప్రా ఎంచుకున్న బ్రౌన్ కలర్ మోనోక్రోమ్ లుక్ అద్భుతంగా ఉంది. నేల వరకు ఉండే ప్రింటెడ్ మాక్సీ స్కర్ట్, దానికి సరిపడా బ్లేజర్‌ను షర్ట్ లేకుండా ధరించి ఆమె అందానికి కొత్త హంగులు అద్దారు. ఈ స్కర్ట్‌కి ఉన్న ఫ్రిల్డ్ హెమ్.. ఆమె శైలికి ప్రత్యేకమైన సొగసును జోడించింది. దీంతోపాటు ఆమె ధరించిన దళసరి బ్రౌన్ బెల్ట్, ఈ...