భారతదేశం, అక్టోబర్ 12 -- బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం రోజున సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లి.. ఐదుగురు గల్లంతు అయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆదివారం సెలవు దినం కావడంతో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు వాడరేవు తీరానికి వచ్చారు. ఈ బృందంలోని సాయి మణిదీప్‌, జీవన్‌ సాత్విక్‌, సాకేత్‌ సముద్రంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోపలికి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువై కొట్టుకుని పోయారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత ఈ ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.

ఇక మరో విద్యార్థి సోమేశ్‌తోపాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతు అయ్యారు. వీరి...