భారతదేశం, నవంబర్ 6 -- సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చీమల ఫోబియాతో బాధపడుతున్న ఓ వివాహిత. ఆత్మహత్యకు పాల్పడింది. భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో శ్రీకాంత్, మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ చిన్నారి కూడా ఉంది. చిందం మనీషా(25)కు చీమల ఫోబియా (మైర్మోకోఫోబియా) ఉంది. పలుమార్లు ఆస్పత్రిలో కూడా చూపించారు.

ఈ నెల 4న ఉద్యోగ నిమిత్తం భర్త విధులకు వెళ్లి వచ్చేసరికి తలుపులకు గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా మనీషా ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని కనిపించింది. అదే గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. "ఐయాం సారీ. అన్నికా జాగ్రత్త. అన్నవరం, త...