భారతదేశం, జనవరి 11 -- మన శంకర వరప్రసాద్ గారు అంటూ ఈ సంక్రాంతికి థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి చిరంజీవి వచ్చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రివ్యూలు, రేటింగ్ ఇవ్వకుండా టికెటింగ్ ఫ్లాట్ ఫామ్ బ్లాక్ చేసేలా కోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు బుక్ మై షో లాంటి ప్లాట్ ఫామ్ లో అది అమలు అవుతోంది. దీనిపై విజయ్ దేవరకొండ సంతోషం, బాధ వ్యక్తం చేశాడు.

చాలా సంవత్సరాలుగా ఈ వ్యవస్థీకృత దాడుల సమస్యను తాను లేవనెత్తుతున్నానని, కానీ ఎవరూ తన మాట వినిపించుకోలేదని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఆదివారం (జనవరి 11) తన ఎక్స్ ఖాతాలో.. ఒక సినిమాకు రేటింగ్స్ నిలిపివేయడం పరిశ్రమలో ఇదే మొదటిసారి అని పేర్కొంటూ ఒక స్క్రీన్‌షాట్‌ను విజయ్ పంచుకున్నారు.

''దీన్ని చూసి సంతోషంగానూ, బాధగానూ ఉంది. చాలా మంది కష్టాలు, కలలు, డబ్బుకు ఏదో ఒక వ...